పదవి విరమణ పొందిన టైపిస్టు మసూద్ జిల్లా ఇంఛార్జి పౌర సంబంధాల అధికారి బి.జగన్

TRINETHRAM NEWSటైపిస్టు మసూద్ కు ఘన సన్మానం పెద్దపల్లి, జూన్ 30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సోమవారం 61 సంవత్సరాల వయస్సు నిండిన నేపథ్యంలో పదవి విరమణ పొందారని జిల్లా ఇంఛార్జి పౌర సంబంధాల..

TRINETHRAM NEWS

టైపిస్టు మసూద్ కు ఘన సన్మానం

పెద్దపల్లి, జూన్ 30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సోమవారం 61 సంవత్సరాల వయస్సు నిండిన నేపథ్యంలో పదవి విరమణ పొందారని జిల్లా ఇంఛార్జి పౌర సంబంధాల అధికారి బి.జగన్ తెలిపారు. సోమవారం జిల్లా ఇంఛార్జి పౌర సంబంధాల అధికారి బి.జగన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని డి.పి.ఆర్.ఓ కార్యాలయంలో పదవి విరమణ పొందుతున్న టైపిస్టు మసూద్ కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు ‌.

ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి పౌర సంబంధాల అధికారి బి.జగన్ మాట్లాడుతూ, గత 29 సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో ఎం.డి. మసూద్ తన సేవలను నిర్విరామంగా అందించి నేడు పదవి విరమణ పోందుతున్నారని తెలిపారు పదవి విరమణ జీవితంలో చాలా కీలకమైన ఘట్టమని అన్నారు. 29 సంవత్సరాల పాటు ప్రభుత్వ రంగంలో సేవలు అందించడం చాలా గొప్ప విషయం అని అన్నారు.

జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ముగిసి, మరో అంకానికి ప్రారంభం అవుతుందని అన్నారు ప్రజలకు వివిధ దశలలో దశాబ్దాల పాటు సేవలు అందించిన ఎం.డి. మసూద్, వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని, మిగిలిన జీవితం ప్రశాంతంగా గడవాలని కోరుకుంటున్నట్లు ఇంచార్జి డి.పి.ఆర్.ఓ తెలిపారు దశాబ్దాల కాలంగా ప్రజలకు సేవలు అందించి నేడు పదవి విరమణ పొందుతున్న ఎం.డి. మసూద్, వారి కుటుంబy సభ్యులకు ఇంచార్జి డి.పి.ఆర్.ఓ కృతజ్ఞతలు తెలియజేశారు పదవి విరమణ పోందుతున్న ఎం.డి. మసూద్ మాట్లాడుతూ,* టైపిస్ట్ గా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో సేవలు అందించడంలో తనకు సహకరించిన అధికారులకు, సిబ్బంది, పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం పదవి విరమణ పొందిన టైపిస్టు ఎం.డి. మసూద్ కు పౌరసంబంధాల అధికారి కార్యాలయ సిబ్బంది, బంధుమిత్రులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డి.పి‌ఆర్.ఓ స్టాఫ్ , బంధు మిత్రులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Retired typist Masood District

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You cannot copy content of this page