కాకినాడ కార్పొరేషన్లో కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు…
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 22. కాకినాడ, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో పిలుపులో భాగంగా బుధవారం ఉదయం కాకినాడలో స్థానిక శారదా దేవి గుడి వద్దనున్న కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అనుబంధ సంఘం, కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది.
ఈ నిరసన ధర్నాకు ముఖ్యఅతిథిగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చులకనా భావంతో వ్యవహరిస్తుందని, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తుందని ఆయన అన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందిన, రిటైర్మెంట్ అయినా వారి స్థానంలో వారి కుటుంబీకులకే ఆప్కాస్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇది వారసత్వపు హక్కు అని వాళ్ళ హక్కులను కాల రాస్తే సహించేది లేదని ఆయన అన్నారు. పెరుగుతున్న అధిక జనాభా కనుగొనగా సిబ్బందిని పెంచాలని సిబ్బందిని పెంచకుండా ఉన్న వారిపై పని భారం పెంచి శ్రమ దోపిడీ చేస్తున్నారని తక్షణమే అదనపు సిబ్బందిని పెంచాలన్నారు.
పర్మినెంట్ కార్మికులకు 11వ పిఆర్సి, బకాయి డీఏలు, ఎస్సార్లు పూర్తి చేయాలని, గత సమ్మెలో ఒప్పంద డిమాండ్స్ అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు కాలనీలు ఏర్పాటు చేయాలని, ఆప్కాస్ కార్మికులకు పదవీ విరమణ 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం 26 వేల రూపాయలు మంజూరు చేయాలని, కాకినాడ స్పెషల్ సానిటేషన్, టాయిలెట్ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని, వారిని ఆప్కాస్ లో విలీనం చేయాలని, జీతాల పెంచాలని ఆయన అన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఉందని కాకినాడ కార్పొరేషన్ లో పనిచేయుటకు పనిముట్లు కొరత తీవ్రంగా ఉందని, మూట్లు కొరత తీర్చాలని,కార్మికులు నెలరోజుల పాటు పూర్తిస్థాయిలో పనిచేసిన బిల్లులు పెట్టడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, బిల్లులు సక్రమంగా పెట్టలేని కారణంగా కార్మికులు జీతాలు పూర్తిస్థాయిలో పడకుండా సగం సగం మాత్రమే పడుతున్నాయని ఆయన అన్నారు.
కార్మికులకు జీతాలు సక్రమంగా రాకపోతే వారికి జీతాలు అధికారుల నుండి రికవరీ చేసి కార్మికులకు మంజూరు చేయాలని, ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ 14 సర్కిల్ ప్రతినిధులు కౌలు శ్రీనివాస్, రామకృష్ణ, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వరరావు, బండి అప్పన్న, దుర్గమ్మ, బండి హరి, నిమ్మకాయల ఈశ్వరరావు, సత్యనారాయణ, బండి హరికృష్ణ, సింగంపల్లి రమణ, నక్క అప్పన్న, నక్క లక్ష్మణ్ తదితర సభ్యుల పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


