Trinethram News : గంజాయిలేని సమాజం నిర్మిద్దామని జగద్గిరిగుట్ట కార్యాలయంలో జరిగిన సమావేశంలో జగదీగుట్ట అన్ని బస్తిల గంజాయిలేని సమాజం నిర్మిద్దామని జగద్గిరిగుట్ట కార్యాలయంలో జరిగిన సమావేశంలో జగదీగుట్ట అన్ని బస్తిల కమిటీల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరై గంజాయి కి వ్యతిరేకంగా కలిసి పోరాటం చేద్దామని పిలుపునివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, బస్తి కమిటీల నాయకులు ముక్తకంఠంతో జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో గంజాయి నిర్మూలన కోసం కలిసి పనిచేద్దామని, జగద్గిరిగుట్టలో గంజాయి అమ్మలనుకునే వారికి, సేవించాలనుకునే వారికి జగద్గిరిగుట్టలో కిరాయిలకు ఇవ్వద్దని, ఒకసారి గంజాయి కేసులో పట్టుబడితే జగద్గిరిగుట్ట నుండి బహిష్కరించాలని, అన్ని బస్తీలలో గంజాయి వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేసి బస్తీ ప్రజలను చైతన్యవంతం చేయాలని నేడు జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు బస్తీ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14న బాలల దినోత్సవం సందర్భంగా జగద్గిరిగుట్టలో మానవహారాన్ని వేలాది మందితో ఏర్పాటు చేయాలని ఇది ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో గంజాయి రహిత సమాజం నిర్మించడం కోసం ప్రజలంతా ఏకం కావాలని గంజాయి వ్యతిరేక కమిటీ నిర్ణయించడం జరిగింది.
ఈ సమావేశంలో నాయకులను ప్రవీణ్ ఆహ్వానించగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ అధ్యక్షతన సీనియర్ నాయకుడు యేసు రత్నంమండల కార్యదర్శి స్వామి, సహాయ కార్యదర్శిలు హరినాథ్, రాములు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు గణేష్, యువజన నాయకులు సాయి పంతుల, పవన్ రెడ్డి, జనసేన సతీష్, బిజెపిహనుమంతు చారి, రాజు యాదవ్, ప్రజానాట్యమండలి బాబు,ఏఐటీయూసీ శ్రీనివాస్, దుర్గయ్య, సదానంద, శ్రీనివాస్ నగర్ ఖయ్యూం,సీనియర్ జర్నలిస్ట్ తొండ వెంకట్, లెనిన్ నగర్ సదానందం, వనం రాజు, జీవి శ్రీనివాస్,రవీందర్ గౌడ్, మైసమ్మ నగర్ బసప్ప, రవి, రవీందర్ రెడ్డి బ్రహ్మానంద చారి,కృష్ణ గుడ్ మార్నింగ్ మురళి, సూరారం కాలనీ అధ్యక్షుడు సందీప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ త్రివేణి, విశ్వబ్రాహ్మణ సంఘం మనోహర్ చారి, దిన బందు కాలనీ ప్రవీణ్, అంజయ్య నగర్ వెంకటేష్, హెల్పింగ్ హాట్స్ హెల్పింగ్ హార్ట్స్ విజయ్, రాజు ఇమామ్ నరసింహ సామిల్ నరసింహారెడ్డి శ్రీనివాస్ సుంకిరెడ్డి అన్ని బస్తీల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


