Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కొండా సుజాత, ఎరగాంధండ్ల వంశీ, రెడ్డి సత్యనారాయణ, నీరుడు ఓంప్రకాష్, మర్గం శంకర్, కొట్టె సులోచన గతంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిఎం సహాయానిధి కింద దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఈరోజు తన నివాసం వద్ద మూడు లక్షల రూపాయల సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేశారు..
ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అలాగే మంత్రివర్యులు శ్రీ దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక కృషితో నియోజకవర్గంలో ప్రజాపాలన ద్వారా బడుగు,బలహీన వర్గాలకు అండగా నిలుస్తుంన్నారని కొనియాడారు..
ప్రజాపాలనలో పేద,మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజానర్సింహా కార్పొరేట్ రంగంలో వైద్యం అందించడంతో పాటు వైద్యనికి అయినా ఖర్చులు సిఎంఆర్ఆఫ్ ద్వారా పేదలకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో దూలపల్లి మాజీ కౌన్సిలర్ బైరి శివకుమార్ గౌడ్, చౌడ శ్రీనివాస్, నాగిళ్ల శ్రీనివాస్, బాలప్ప, యాం సాగర్, ఉలిపి శ్యామ్, అరుణ్ కుమార్, రఘు గౌడ్, సంపత్, కృష్ణ, కృష్ణమ నాయుడు, కృష్ణారెడ్డి, మరియు లబ్దిదారులు, నియోజకవర్గం ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


