ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ డిమాండ్ చేస్తూ డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయములో సూపరిండెండెంట్ అనిల్ కుమార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ లక్షల రూపాయల జీతం పొందే పర్మినెంట్ కార్మికులకు రూ. 25 వేల దసరా అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కనీసం రూపాయలు రూ.20 వేల దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పర్మినెంట్ ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, వారికి రూ.50 వేలు చెల్లించాలని కూడా కోరుతున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం పర్మినెంట్ ఉద్యోగులతో కలిసి శ్రమించి ఎన్ హెచ్ ఎం సంస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విస్మరించడం తగదని పేర్కొన్నారు.
వారికి కూడా పండుగ ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలని, వారికి కూడా రూపాయలు 20 వేల దసరా అడ్వాన్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం స్కీము లో పనిచేస్తున్న వారందరితోపాటు డైస్, రేడియాలజిస్ట్ వారికి కూడా నూతన జీవో ప్రకారం కాకుండా పాత జీవో ప్రకారము పిఆర్సి కలిపి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నూర సంపత్ పటేల్, జిల్లా అధ్యక్షులు జన్ను కోర్నల్ మరియు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


