Vasireddy Seetharamaiah : జిడికె 11వ ఇంక్లైన్,లో బోనాల సంబరాలు ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికే 11వ ఇంక్లైన్ లో జరిగిన బోనాల ఊరేగింపు లో పాల్గొన్న ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య దుర్గా మాత ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో అమ్మ వారి ని దర్శించుకొని కార్మికుల కు ముందస్తు గా దసర పండుగ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అమ్మ వారి దీవెనలు సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకోవడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీను, జి.ఎం.కమిటి మెంబర్ సిద్దమల్ల రాజు, ఫిట్ సెక్రటరీ నాయిని శంకర్, సహాయ కార్యదర్శి గొడిశల నరేశ్, నాయకులు చెప్యాల భాస్కర్, ఎం.చక్రపాణి, బాలక్రిష్ణ, రియాజొద్దీన్, రంజిత్, కీర్తి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bonala celebrations at GDK 11th Incline,

You cannot copy content of this page

Scroll to Top