గొట్టిముక్కల వెంకటేశ్వరరావు(జీవీర్)కి అందజేసిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య.
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 25 :కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ స్థలం నిర్మాణం కొరకు ఆదివారం రోజు ఉదయం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు (జివిఆర్)కి కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జీవీర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించుకుని, జర్నలిస్టులకు అందుబాటులోకి వెంటనే తీసుకువస్తానని,అలాగే జర్నలిస్టులందరికీ సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా చర్యలూ తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పీ.వీ నాగరాజు,అడ్వైజర్ బి. కిషోర్ చారి, కో-ఆర్డినేటర్ ఎం.కళ్యాణ్ చక్రవర్తి, కోశాధికారి పుట్టి నగేష్, జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు,వి.సుజాత, మీడియా కన్వీనర్ దుర్గాప్రసాద్,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. లక్ష్మి, కల్చరల్ సెక్రటరీ కాసాని రంజిత్ కుమార్, ఈసీ మెంబర్ రవీందర్ రెడ్డి, వీర శేఖర్ రెడ్డి,కర్ణ కుమార్, అనిల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


