
జెడ్పీహెచ్ఎస్ చెరుకుపల్లి పాఠశాల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేత
Representation to MLA : డిండి (గుండ్లపల్లి) మండల పరిధిలోని చెరుకుపల్లి పర్యటనకు విచ్చేసిన దేవరకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ ని జెడ్పీహెచ్ఎస్ చెరుకుపల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇస్లావత్ గోప్యా నాయక్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం మర్యాదపూర్వకంగా కలిసి పాఠశాల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పాఠశాల అభివృద్ధికి మరియు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పలు ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆ వినతిపత్రంలో కోరడం జరిగింది. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విద్యుత్ సంభాలకు వైర్లు (లైన్ విస్తరించి విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించడం) ద్వారా విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని కోరారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రహరీ గోడ మరియు మధ్యాహ్న భోజనం కోసం నిర్మిస్తున్న డైనింగ్ హాల్ ఫినిషింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. రాత్రి వేళల్లో పాఠశాలలో దొంగల బెడదను అరికట్టడానికి మరియు పాఠశాల రికార్డులు, కంప్యూటర్లు, ఇతర విలువైన ఆస్తుల పరిరక్షణ కొరకు ప్రాంగణంలో హైమాస్ట్ విద్యుత్ దీపాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో మరియు సాధారణ రోజుల్లో మెయిన్ గేట్ నుండి ఆఫీస్ రూమ్ మరియు స్టేడియం వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి విబీజీరామ్ (VBGRAM) పథకం ద్వారా సీసీ రోడ్లు మంజూరు చేయాలని కోరారు. దీనికి శాసన సభ్యులు సానుకూలంగా స్పందించి త్వరలోనే తగినచర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇస్లావత్ గోప్యా నాయక్ తో పాటు ఉపాధ్యాయులు బీ. నాగేశ్వరరావు, వేణు, లింగయ్య, శ్రీనివాస్, సర్దార్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe