త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం హైదరాబాద్ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రికి వివరించారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని అడిగారు. స్పందించిన శ్రీధర్ బాబు నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే తో ఇతరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


