CPM : నాణ్యత ప్రమాణాలు సడలించి పత్తి కొనుగోలు ఎకరాకు12క్వింటాలు కొనుగోలు చేయాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ సిసిఐ కొనుగోలు వద్ద సిపిఎం రైతు జిల్లా నాయకులు పర్యటన చెయ్యడం జరిగింది.

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శులు మద్దులపల్లి సుదర్శన్. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్.
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ అధిక వర్షాలతో దెబ్బతిన్న పత్తి పంటను నాణ్యత ప్రమాణాలు సడలించి మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూనన్నము. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ప్రకారం కొనుగోలు చెయ్యాలి. తేమ శాతం పేరుతో రైతులను మోసం చెయ్యడం ఆపాలని సిపిఎం ,రైతు సంఘం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం లో కేంద్రకాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించటం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్.రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్ లు మాట్లాడుతూ జిల్లాలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం పేరుతో రైతులను మోసం చేస్తున్నారు. అధిక వర్షాలకు పంటలు నీట మునిగినావి. ఉన్నపంటలు మొత్తం రైతులు నష్టపోయారు. ఉన్న పంటకు మద్దతుదార ఉన్న అమలు చెయ్యడం లేదు. మద్దతు ధర 8110 రూపాయలు ఉన్న అమలు కావడం లేదు. కొనుగోలు కేంద్రలలో ఎకరాకు 12క్వింటాలు కొనుగోలు చేయాలని ఉన్న, 7కీoటలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఆంక్షలు వెతివెయ్యాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చెయ్యడం సరికాదు రైతులను ఆదుకోవాలి. మధ్య దళారుల చేతులలో రైతులను నిలువు దోపిడి చేస్తున్నారు.పెట్టిన పెట్టుబడి రాక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొనుగోలు కేంద్త్రల వద్ద పెట్టిన ఆంక్షలు వెతివెయ్యాలి.రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ లు కేంద్రంపై వత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నాము. లేనిచో ఆందోళనలు పోరాటాలు తీవ్రతరం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం రైతు సంఘం నాయకులు సుదర్శన్ మహిపాల్ సతీష్ లక్ష్మయ్య అగ్బర్ శ్రీను రైతులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Relax the quality standards and purchase cotton

You cannot copy content of this page

Scroll to Top