MLA Patsamatla Dharmaraja : గ్రామీణ ప్రాంతాల్లో పునరుద్ధరణ మౌలిక వసతులు

TRINETHRAM NEWS

తేదీ : 24/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు నియోజకవర్గం, మండలం రాచూరు గ్రామంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పర్యటించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేతృత్వం లో రాష్ట్రంలో మౌలిక వసతుల పునరుద్ధరణ , ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనులు వేగంగా పుంజుకున్నాయని తెలిపారు. గ్రామ ప్రజలు స్థానికంగా ఉన్న సమస్యలను తెలియజేసి వినతి పత్రాలను శాసనసభ్యులకు అందజేశారు.
ప్రతి ఒక్కరి సమస్యను నేరుగా తెలుసుకొని వాళ్ల నుండి వినతులు స్వీకరించారు. గత ప్రభుత్వం లో అస్తవ్యస్తమైన పల్లెల ప్రగతని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించిందని , దీనిలో భాగంగా రాచూరు గ్రామంలో నలభై ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, మరియు నియోజకవర్గం ముఖ్య కూటమి నాయకులు, సంబంధిత మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rehabilitation infrastructure in rural

You cannot copy content of this page

Scroll to Top