నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగులందరనీ రెగ్యులర్ చేయండి- ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
హైదరాబాద్ జిల్లా
18 డిసెంబర్ 2024
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులందరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరణ చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయలేదు చేయాలని, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరనీ ఒక దాటి మీద తీసుకొచ్చి కార్పొరేషన్ కిందికి మార్చాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలకు పిలిచి ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడి న్యాయం చేయకుంటే త్వరలో దిశా, దశ నిర్ణయిస్తామని ఈ సభ ముఖంగా తెలియజేయడం జరుగుతుంది.. ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గత 25 సంవత్సరాల నుంచి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం రెగ్యులర్ చేయడం చెప్పారు, డీ.ఎస్.సి (డిస్టిక్ సెలక్షన్ కమిటీ) ద్వారా నియమితులైన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.
గత చాలా సంవత్సరాల పైగా జాతీయ ఆరోగ్య మిషన్ లో సేవలందిస్తున్నప్పటికీ ప్రభుత్వం సేవలను గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. పారామెడికల్ , నాన్ పారామెడికల్ అని 510 జీవో వల్ల చాలామంది నష్టపోయారు కావున నష్టం జరిగిన ఉద్యోగులందరికీ కూడా ఒక కొత్త జీవో విడుదల చేసి నష్టం జరిగిన ఉద్యోగులకు జీవితాలకు వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న వైద్యులకు గత ప్రభుత్వం రెగ్యులర్ చేసిందని అదే రీతిలో ఆల్ క్యాడర్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని ఒకే సంస్థలో పనిచేసిన డాక్టర్ కు రెగ్యులరైజేషన్ రెండుసార్లు చేశారు, అక్కడ పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ ఉద్యోగులను ఎందుకు ఎందుకు రెగ్యులరైజేషన్ చేయరు డాక్టర్లకు ఎలా వర్తిస్తది సిబ్బందికి ఎలా వర్తించదు ఇది ఎలా సాధ్యం అలా చేయకుండా అందర్నీ రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.అంతేకాకుండా రెండు దఫాలుగా హెల్త్ అసిస్టెంట్లకు కూడా ప్రభుత్వం రెగ్యులర్ చేసిందని వారిని పరిగణలోకి తీసుకొని నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం మీదనే తమ ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ ఉద్యోగుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని , ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కరుణించి రెగ్యులర్ చేయాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీడియా ద్వారా తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App