జూన్ 26, 2026
TRINETHRAM NEWS

మండపేట: త్రినేత్రం న్యూస్ : న్యూ డ్రాగన్ చైనీస్ కుంగ్ ఫు గ్రాండ్ మాస్టర్ పిట్టా రాజబాబు శిక్షణ పొందిన విద్యార్థులు కుంగ్ ఫు కరాటే పోటీల్లో పతకాల పంట పండించారు. రాజానగరం మండలం తుంగపాడులోని శిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన ఇంటర్ స్టేట్ కుంగ్ ఫు అండ్ కరాటే ఓపెన్ చాంపియన్ షిప్ 2025 పోటీల్లో మండపేట నుంచి 21 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

వీరిలో 16 మంది విద్యార్థులు ఎల్లో బెల్ట్ నుంచి బ్రౌన్ బెల్ట్ వరకూ కటాస్ విభాగంలో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాలను దక్కించుకున్నారు. స్పేరింగ్ విభాగంలో డి రాకేష్ (బ్లూ బెల్ట్) మొదటి స్థానం, పి సాయి, ఎల్. సిద్దు (గ్రీన్ బెల్ట్‌లు) మొదటి స్థానాలను సాధించారు. అలాగే సిహెచ్ తరుణ్ గోవింద్ (ఎల్లో బెల్ట్) మొదటి స్థానం, జి యజ్ఞేశ్వర రెండవ స్థానం గెలుచుకున్నారని మాస్టర్ రాజబాబు తెలిపారు.

రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించి అభినందనలు తెలిపారు. మాస్టర్ రాజబాబు శిక్షణలో మరింత అభివృద్ధి సాధించి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో బహుమతులు గెలుచుకోవాలని ఆకాంక్షించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kung Fu Karate competitions

You cannot copy content of this page