అనపర్తిలో “ప్రజా సమస్యలపై పిర్యాదుల స్వీకరణ” కార్యక్రమం నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.
త్రినేత్రం న్యూస్ : అనపర్తి మండలం అనపర్తి రజక కమ్యూనిటీ హల్ లో “ప్రజా సమస్యలపై పిర్యాదుల స్వీకరణ” కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుండి పలు అంశాలపై పిర్యాదలు స్వీకరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ నేటి “ప్రజా సమస్యలపై పిర్యాదుల స్వీకరణ” కార్యక్రమంలో 26 వినతులు వచ్చాయని తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ప్రజలు త్రాగునీరు, విద్యుత్, రోడ్లు తదితర సమస్యలను తెలియచేసారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం వినతులను ఆయా శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారించే దిశగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిస్కారం చేయడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధికారులు,అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


