RBI Interest Rates : యథాతథంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు
Trinethram News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 5.25 శాతం వద్దనే కొనసాగిస్తున్నామని తెలిపారు.
గతేడాది పలుమార్లు వడ్డీ రేట్లలో కోతలు విధించిన ఆర్బీఐ, ఈ సారి అలాగే ఉంచింది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్ వంటి రుణాల మీద వడ్డీ భారం పెరగదు. ఇది సామాన్యులకు పెద్ద ఊరట.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

