Ravindra Kumar : ప్రజలకిచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలం

TRINETHRAM NEWS
Ravindra Kumar The government has failed

దేవరకొండ మాజీ ఎమ్మెల్యే:- రవీంద్ర కుమార్.

Ravindra Kumar : దేవరకొండ డివిజన్ ఏప్రిల్ 04, త్రినేత్రం న్యూస్. సిఐడి విచారణ పేరుతో వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
సిఐడి కార్యాలయం ముట్టడి సందర్భంగా ఆయన ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిక ల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ 420 హామీలను ఇచ్చిందని ఇప్పుడు 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు అభివృద్ధి మరిచి అరెస్టుల పేరుతో ప్రభుత్వం పబ్బం గడుపుతుందని ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top