నవంబర్ 24, 2026
TRINETHRAM NEWS
Shekhar Reddy

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తీదేడు గ్రామ సర్పంచ్

Shekhar Reddy : చింతపల్లి నవంబర్ 24, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నల్గొండ జిల్లా చింత పల్లి మండలం తీదేడు గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కార్తీక దీపం వెలిగించి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, గ్రామంలో సుఖశాంతులు, సమృద్ధి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించారు.

కార్తీక మాసంలో శివారాధనకు ఎంతో విశిష్టత ఉందని, ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page