నవంబర్ 23, 2026
TRINETHRAM NEWS
Ravindra Kumar Birthday

Ravindra Kumar Birthday : దేవరకొండ డివిజన్ నవంబర్ 23, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు సోమవారం దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రవీంద్ర కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకుడి పుట్టినరోజును ఉత్సాహంగా జరుపుకున్నారు.

అనంతరం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ…. రవీంద్ర కుమార్ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

— డిండి (గుండ్లపల్లి) ;–+ మండలకేంద్రంలో దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్రకుమార్ జన్మదిన వేడుకలు సోమవారం స్థానిక రాజీవ్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల ఆంజనేయులు, నీల రవికుమార్, బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు,బిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, కౌన్సిలర్ పొట్ట మధు, ముత్యాల రవి, బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర నాయకులు జనీబాబ, యువజన విభాగం రాష్ట్ర నాయకులు ఇలియాస్ పటేల్,బిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు పాత్లవత్ లక్ష్మణ్,మకాం చంద్రమౌళి,జమీర్ బాబా,మాడెం రాములు, అఫోజ్,పగిడిమర్రి సతీష్, వంగూరి పాపయ్య గౌడ్,నేనావత్ నాగార్జున,గుండాల శివ,గుండాల వెంకట్, ఫజల్, వడత్య గణేష్, రాము, రషీద్ , బల్ముల తిరుపతయ్యా, శ్రీనివాస్ చారి,వినోద్, సుంకరి చంద్రయ్య, రామచంద్రం, ఖలీల్, రాజు, రేనయ్య , అంకల్ , హరీష్,హుస్సేనీ, ఠాగూర్ , దేవేందర్ ,నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page