జూన్ 30, 2026

WhatsApp Image 2024 02 05 at 8.00.06 PM

TRINETHRAM NEWS

శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు పోలీస్ అధికారులు

మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీగా సిహెచ్ రవికాంత్ బదిలీపై వచ్చారు. గతంలో ఆయన విజయవాడ నగర డిఎస్పీగా విధులు నిర్వహించారు. తాజాగా సోమవారం తెనాలి రోడ్డు లోని డిఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎస్పీ ని కలిసిన వారిలో మంగళగిరి పట్టణ సీఐ ఎం శ్రీనివాసరావు, రూరల్ సీఐ వెంకట్రావ్, తాడేపల్లి సిఐ మధుసూదన్ రావు, మంగళగిరి పట్టణ ఎస్సై మహేంద్రా, రూరల్ ఎస్సై క్రాంతి కిరణ్, ట్రాఫిక్ సిఐ బి బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page