వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం లొఅమరజీవి కార్మికోద్యమ నాయకుడు పర్స సత్యనారాయణ 10వ వర్ధంతి సందర్భంగా పూలు పెట్టి నివాళి అర్పించడము జరిగింది ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ మాట్లాడుతూ నేడు తమ తమ హక్కులకోసం పోరాటలు చేస్తున్నము అంటే మహోన్నతమైన వ్యక్తులు పోరాట యోధులు కార్మికుల కర్షకుల కోసం నాటి ప్రభుత్వ పాలకులపై అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేశారు అనేక హక్కు లు సాధించారు. నేడు మనకు అనేక హక్కులు వచ్చాయి, ఇంకా అనేకం హక్కలు రావాల్సి ఉన్నవి.
వాటికోసం మనం నిరంతరం పోరాటాలు చేసి సాధించుకోవాలి నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు కార్మికుల కర్షకుల పేదల హక్కులను కాలరస్తూ హరించే విధంగా పరిపాలన చేస్తున్నారు. అందుకే నాటి మన పోరాట యోధులు పర్స అమరజీవి కార్మికోద్యమ నేత సత్యనారాయణ లాంటి నేతలను ఆదర్శంగా తీసుకొని మరో చికాగో పోరాటాలకు ఈ పాలకుల కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు ఈ కార్యక్రమంలో , citu యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు భారతి, లక్ష్మి కలావతి పెంటమ్మ స్వరూప పరిమళ నిర్మల విజయ లక్ష్మి అనసూయ బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


