Rare Two-headed Snake : అరుదైన రెండు తలల పాము కలకలం

TRINETHRAM NEWS

విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్న అటవీ శాఖ అధికారులు

​Trinethram News : మహబూబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలం కొత్తపల్లి గ్రామంలో వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టు రట్టయ్యింది. అరుదైన, అంతరించిపోతున్న జాతికి చెందిన రెండు తలల పామును ఓ వ్యక్తి తన వద్ద బంధించి ఉంచుకున్నట్లు సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, కొత్తపల్లి గ్రామంలోని సదరు వ్యక్తి నివాసంపై ఆకస్మిక దాడి చేశారు.

నిందితుడి వద్ద నుండి రెండు తలల పామును స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాలతో ఇలాంటి పాములను భారీ ధరకు విక్రయించే ముఠాలు ఉన్నాయని, ఆ కోణంలోనే ఈ వ్యక్తి పామును దాచి ఉంచి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rare two-headed snake stirs up trouble

You cannot copy content of this page

Scroll to Top