జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 10 at 10.35.05 PM

TRINETHRAM NEWS

ప్రేమ పేరుతో నమ్మించి విద్యార్థినిపై అత్యాచారం

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) అనే వ్యక్తి.. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానని నమ్మించి దారుణానికి పాల్పడ్డాడు

వసతి గృహంలో ఉంటున్న యువతిని ఫంక్షన్ ఉందని ఇంటికి ఆహ్వానించిన హుస్సేన్.. ఇంటికి వెళ్ళేసరికి హుస్సేన్ స్నేహితులు షేక్ గాలి సైదా (26), చింతల ప్రభుదాస్ (25) ఇంట్లో ఉన్నారు

ఫంక్షన్ జరగట్లేదని గ్రహించిన యువతి హుస్సేన్ ను నిలదీసింది. నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని పిలిచానని చెప్పి నమ్మించి, ఆ తర్వాత బయటకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన హుస్సేన్

హుస్సేన్, ప్రభుదాస్ ఇంటి బయట కాపలా ఉండగా.. షేక్ గాలి సైదా గదిలోపలకి వచ్చి నువ్వు హుస్సేన్ దిగిన వ్యక్తిగత ఫోటోలు ఉన్నాయని బెదిరించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు

ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తూ శారీరకంగా గడపాలని హుస్సేన్, ప్రభుదాస్, గాలి సైదా వేధిస్తున్నారని యువతి తల్లితండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు

కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rape of a student

You cannot copy content of this page