కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 9 : వైద్యో నారాయణ హరి అన్న సూక్తిని నిజం చేస్తూ కూకట్పల్లి రాందేవ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం నాలుగు వందల మంది జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. డయాగ్నస్సిస్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.హాస్పటల్ చైర్మన్ కమలాకర్, సీఈఓ యోబు ను రమేష్ అభినందించారు.ఆసుపత్రిల అన్ని విభాగాలను రమేష్ కు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం ఖరీదైనది ఖర్చుతో కూడుకున్నది ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్న అపోహను తొలగిస్తూ కూకట్పల్లి రాందేవ్ హాస్పటల్ యాజమాన్యం నిరూపించిందన్నారు.పేదవారి దగ్గరనుంచి సామాన్యుడికి కూడా వైద్యం అందుబాటులో ఉండేలా ఆసుపత్రి ని నిర్వహిస్తున్న యాజమాన్యానికి ధన్యవాదాలు అన్నారు.
వేల రూపాయల విలువచేసే పరీక్షలు చేయటం ఉచితంగా చేయడం యాజమాన్య దాతృత్వానికి ప్రతీక అన్నారు కాలంతో పరుగులు పెడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే జర్నలిస్టులు నిరంతరం తమ ఆరోగ్య పరిరక్షణలోనూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాధులు వచ్చిన తర్వాత తీసుకునే చర్యల కంటే ముందు జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిదని రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, శివ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


