Dr. Satthi : అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై రామకృష్ణారెడ్డి క్రెడిట్‌ చోరీ ప్రయత్నం

TRINETHRAM NEWS

వాస్తవాలు బయటపెట్టిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

  • మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కృషితో అనపర్తి ప్రభుత్వాసుపత్రిలో 23 మంది స్పెషలిస్టులు, సుమారు 90 మంది పారా మెడికల్ సిబ్బంది నియామకం
  • మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి, అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి 100 పడకలు మంజూరు చేశారు
  • వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 12.5 కోట్లు మంజూరు, అదనపు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభం
  • స్థల దాతకి – బిల్డింగ్ దాతకి తేడా కూడా తెలియని ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
  • రామకృష్ణారెడ్డి క్రెడిట్ చోరీ పై డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి వాస్తవాలను బట్టబయలు చేశారు,

త్రినేత్రం న్యూస్, డిసెంబర్ 3: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని వాస్తవాలతో బట్టబయలు చేస్తూ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఈరోజు స్థానిక పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.

అనపర్తి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి గురించి నేను(డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,) ఇటీవల మాట్లాడగా, శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ‘ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి అంతా నేనే చేశాను’ అంటూ కీర్తి యాగం మొదలుపెట్టడం ఆశ్చర్యకరం అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వ్యాఖ్యానించారు. నువ్వు మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క అభివృద్ధి వాసన కూడా వచ్చిందా అంటే.. నీ (రామకృష్ణారెడ్డి) దగ్గర సమాధానం – లేదు అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, స్పష్టం చేశారు.

డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి , మాట్లాడుతూ –

నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనపర్తి ప్రభుత్వాసుపత్రిలో 23 మంది స్పెషలిస్టులు, సుమారు 90 మంది పారా మెడికల్ సిబ్బంది నియామకం జరిగేలా కృషి చేశాను. ఆ కృషి వల్లే ఈరోజు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పనితీరు బాగుందని నువ్వే మెచ్చుకున్నావు రామకృష్ణారెడ్డి! అది మా ప్రభుత్వ హయాంలో చేసిన కృషి ఫలితం అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి , పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి,అల్ అనపర్తి ప్రభుత్వాసుపత్రికి 100 పడకలు మంజూరు చేశారు.
నేను(డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి) శాసనసభ్యుడిగా ఉండగా 12.5 కోట్లు మంజూరు చేయించి, శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించాము. అయినా ప్రస్తుత శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మేము చేసిన శంకుస్థాపన మీదే మళ్లీ శంకుస్థాపన చేయడం ప్రజలను మోసం చేయడం కాదా? అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ప్రశ్నించారు.

డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాట్లాడుతూ –

స్థల దాతకి – బిల్డింగ్ దాతకి తేడా కూడా తెలియని స్థాయిలో ప్రవర్తిస్తున్నావు రామకృష్ణారెడ్డి. బుల్లయ్య , 200 కోట్ల విలువైన స్థలాన్ని ప్రభుత్వాసుపత్రికి అందించారు. ఆయన పేరు తరతరాల పాటు నిలవాలి. రామవరంలో నీ బంధువులు 4–5 లక్షలు ఇచ్చి శాశ్వతంగా పేరు ఉండాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం?’’ అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ప్రశ్నించారు. బుల్లయ్య , విగ్రహం పెట్టడానికి రామకృష్ణారెడ్డి నువ్వు అడ్డుకోలేదు అంటావు , అవసరం అయితే ఆ కుటుంబంతో ప్రకటన చేయించమంటావు.

ఆ కుటుంబం నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి ప్రశాంతంగా బ్రతికే అవకాశం ఇస్తావా,అదే భయంతో నియోజకవర్గంలో ఎన్నో నోళ్లు మూసుకుపోయాయి’’ అని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వ్యాఖ్యానించారు. ప్రజలు నీ నిరంకుశ పాలనతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, రామకృష్ణారెడ్డి. సమయం వచ్చినప్పుడు ప్రజల తీర్పు నీకు చూపిస్తారు. ఆ రోజు నీకు ఉన్న సరదా మొత్తం తీరిపోతుంది రామకృష్ణారెడ్డి అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramakrishna Reddy's attempt to steal credit on the development of Anaparthi Government Hospital

You cannot copy content of this page

Scroll to Top