Gold Jewellery Murder : బేగరి రాములమ్మ బంగారి వస్తుల గురించి హత్య

TRINETHRAM NEWS

వికారాబాద్ నియోజకవర్గ త్రినేత్రం న్యూస్ చెన్ గోముల్ గ్రామానికి చెందిన బేగరి రాములమ్మ భర్త రామయ్య వయసు అందాజ 80 సంవత్సరాలు గల వ్యక్తి తప్పిపోయిన విషయంలో చెన్ గోముల్ పోలీస్ స్టేషన్ నందు తప్పిపోయిన బేగరి రాములమ్మ కొడుకు బేగరి నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది. అయితే చెన్ గోముల్ గ్రామంలోని జలీల్ మియా తండ్రి కాసిం సాబ్ యొక్క పాడుబడ్డ ఇంటిలో నుండి కుళ్ళిన వాసన రాగ ఇంటి పక్కల ఉన్న వ్యక్తి వాసన గమనించి అనుమానంతో బేగరి నరసింహులు కు తెలుపగా అతడు మరియు అతని కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఇంటి లోపల వెనక భాగంలోని పెరడులో ఒక గోనెసంచి మూట కట్టి ఉన్నది. అట్టి మూట విప్పి చూడగా అ మూటలో తప్పిపోయిన వ్యక్తి రాములమ్మ యొక్క శవం కుళ్ళిన స్థితిలో ఉన్నది.

ఆమె మెడలో బంగారు గుండ్లు చేతికి వెండి గాజులు కనిపించలేదు. అట్టి రాములమ్మమరణం పై అనుమానంతో ఇట్టి కేసులో దర్యాప్తు చేయడం జరిగింది. ఇట్టి దర్యాప్తులో భాగంగ అనుమానితుల సీడీర్స్ ఎనాలిసిస్ మరియు సీసీటీవీఎస్ పుటేజ్ చెక్ చేయగా, అనుమానితుడైన బెలకాటూరి నరేష్ అనే వ్యక్తిని విచారించగా తాను, మెహర్ మరియు భూతుల్ కలిసి మృతురాలి హత్య చేసి ఆమె దగ్గర ఉన్న బంగారు గుండ్లు మరియు 6 వెండి గాజులు కాజేయాలనే ఉద్దేశ్యం తో ముందుగా వేసిన పథకం ప్రకారం తేదీ: నాడు మెహర్ ఇంటికి రాగా, అప్పుడు మెహర్ నరేష్ కు ఫోన్ చేసి రమ్మని చెప్పగా నరేష్ వాళ్ళ ఇంటికి రాగా అక్కడ ముగ్గురు కలిసి మృతురాలినీ గొంతు పిసికి చంపి ఆమె దగ్గర ఉన్న బంగారు గుండ్ల దండ, ఆరు వెండి గాజులు మరియు ముక్కు పుడుకలను తీసుకొని, అక్కడే ఉన్న గోనె సంచిలో శవాన్ని ఉంచి, అదే రోజు రాత్రి సమయం లో అదే ఊరిలో ఉన్న పాడు బడ్డ జలీల్ ఖాన్ ఇంట్లో పడేసినారని తన నేరాన్ని ఒప్పుకున్నాడు.

అక్కడ పడిపోయిన ఆమె యొక్క ఆకుపోకలు వేసుకొనే సంచి మరియు వాటిలోని వస్తువులను ఇంటి పైన పడవేసినాడు. మరియు అట్టి ఆకూపోకల సంచిని కాల్చివేసినారు. నేరస్తుల నుండి అట్టి బంగారు గుండ్లు, వెండి గాజులు, సున్నం డబ్బా, జర్దా మరియు పోకల డబ్బా, రెండు తాళం చెవిలు మరియు మృతురాలి ఆకూపోకల సంచిని కాల్చిన ముక్కలు స్వాధీనపరుచోవడం జరిగింది. మరియు నిందితులను రిమాండ్ కు పంపించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Begari Ramulamma's gold jewellery murder

You cannot copy content of this page

Scroll to Top