Rama Rajesh Khanna : తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రామ రాజేష్ ఖన్నా ఏకగ్రీవంగా ఎన్నిక

TRINETHRAM NEWS

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి…. తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వరంగల్ జిల్లా రామన్నపేట కి చెందిన రామ రాజేష్ ఖన్నా ను ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి యూసుఫ్ శనివారం సాయంత్రం జరిగిన రాష్ట్ర నాలుగవ మహాసభలో తెలిపారు..

శ్రీ రాముల వారి కళ్యాణ మండపంలో జరిగిన తెలంగాణ మెడికల్ కాంట్రా క్ట్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం జరిగింది.ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ…

తనమీద నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా ఎన్నుకున్నందుకు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షలు ఎం.డి.యూసుఫ్ కి, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ కి ప్రత్యక్ష కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలోని వివిధ ప్రభుత్వ హాస్పిటల్ జాతీయ ఆరోగ్య మిషన్ మరియు తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు అండ్ వర్కర్స్ యూనియన్ ఉద్యోగులు సమస్యలు శాశ్వత పరిష్కరం అయ్యే అంతవరకు కృషి చేస్తానని రామ రాజేష్ ఖన్నా అన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rama Rajesh Khanna unanimously elected

You cannot copy content of this page

Scroll to Top