Rajineni Venkateswara Rao : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజినేని వెంకటేశ్వర రావు.

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 08 త్రినేత్రం న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపును కాంక్షిస్తూ నల్గొండ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తో కలిసి బోరబండ డివిజన్ లో డోర్ టు డోర్ ప్రచారంలో డిండి మండల భారాస అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అంతా బి ఆర్ ఎస్ పార్టీ వైపే వున్నారని , ఎన్నికలో అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయం అని అన్నారు . ప్రజలు కాంగ్రెస్ నాయకులు ఎన్ని వాగ్దానాలు గ్యారెంటీ లు చెప్పిన నమ్మే స్థితిలో లేరనీ పేర్కొన్నారు . ఆయనతోపాటు డిండి పి ఎ సి ఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాసరావు, భారాస నాయకులు మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వెంగల్ రావు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rajineni Venkateswara Rao participated in the Jubilee Hills by-election campaign

You cannot copy content of this page

Scroll to Top