Railway Overbridges and Underbridges : వికారాబాద్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు వెంటనే చేపట్టాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి న్యూస్… చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మరియు రైల్వే అండర్ బ్రిడ్జిల పనులు సత్వరమే చేపట్టాలని కోరుతూ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి న్యూఢిల్లీలోని రైలు భవన్ లో రైల్వే మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వి. సోమన్న తో సమావేశమయ్యారు. గత సంవత్సరం శంకరపల్లి ప్రాంతానికి విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు కూడా ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్టు ఆయన వివరించారు.
అదేవిధంగా నావంద్గి రైల్వేస్టేషన్ లో హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు నిలపడానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సానుకూల ప్రతిపాదన పంపడం జరిగిందని, దానికి అనుగుణంగా రైల్వే బోర్డు ద్వారా తక్షణం హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలును ఆపడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ మేరకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
వికారాబాద్ పట్టణంలోని జిల్లా కోర్టు వద్ద మరియు రామయ్య గూడా ప్రాంతాలలో ఉన్నటువంటి రైల్వే లెవెల్ క్రాసింగ్ ల వద్ద డిపిఆర్ లు పూర్తయిన దృష్ట్యా ఆర్ఓబి మరియు ఆర్ యు బి ల నిర్మాణానికి వెంటనే పనులు ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా కొండకల్, ముబారక్ పూర్, మర్పల్లి, పాత శంకర్పల్లి, మొరంగుపల్లి, గేట్ వనంపల్లి, గొల్లగూడ, నావంద్గి, సిద్ధాంతి, శాతం రాయి, ఫతేపూర్ ఎల్.హెచ్.ఎ స్ నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరగా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

