TRINETHRAM NEWS

బెంగళూరుకు వరుసగా రెండో ఓటమి

Trinethram News : ఏప్రిల్ 11 : బెంగళూరుకు వరుసగా రెండోసారి సొంతగడ్డపై ఘోర పరాజయం ఎదు రైంది. ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన ఐదో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు మరోసారి తొలి బ్యాటింగ్ చేస్తూ తడబడింది.

దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ స్పిన్ ద్వయం ఇందులో కీలక పాత్ర పోషించారు. అనంతరం కేఎల్ రాహుల్ వరుసగా రెండో అర్ధశతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు.

గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కూడా టాస్ ఓడిపోయిన బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. గతం లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా జట్టు తొలుత బ్యాటింగ్ చేసి ఓడిపోయింది. ఈసారి కూడా సీన్ రిపీట్ అయింది. అయితే ఈసారి జట్టుకు మంచి ప్రారంభం లభించింది.

ఫిల్ సాల్ట్ రాగానే దూకుడు గా ఆడి ఢిల్లీని బ్యాక్‌ఫుట్‌ లో నెట్టాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్‌లో 30 పరు గులు రాబట్టాడు.అయితే నాలుగో ఓవర్ నుంచి అంతా మారిపోయింది. విరాట్ కోహ్లీ, సాల్ట్ మధ్య సమన్వయ లోపం కారణంగా సాల్ట్ రనౌట్ అయ్యాడు. అక్కడి నుంచి బెంగళూరు పతనం మొదలైంది.

విప్రాజ్ నిగమ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేశారు. కెప్టెన్ రజత్ పాటిదార్, జితేష్ శర్మ కూడా ఈసారి ప్రభావం చూపలేకపో యారు. చివరిలో టిమ్ డేవిడ్ కేవలం 20 బంతుల్లో 37 పరుగులు చేసి జట్టును 163 పరుగుల స్కోరుకు చేర్చాడు.

ఆ తర్వాత బరిలోకి దిగిన ఢిల్లీ మొదట్లోనే తడ బడింది. ఐదో ఓవర్ ముగిసేసరికి జట్టు 3 వికెట్లు కోల్పోయింది. స్కోరు బోర్డు పై కేవలం 30 పరుగులు మాత్రమే ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ ఢిల్లీకి ఈ షాక్‌లు ఇచ్చారు. 58 పరుగుల వద్ద కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా పెవిలియన్ చేరాడు.

ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్ మైదానంలోకి దిగి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ట్రస్టన్ స్టబ్స్ అతనికి సహకరించాడు. ఇద్దరూ కలిసి నెమ్మదిగా జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. 14వ ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 99 పరుగులు మాత్రమే. చివరి 6 ఓవర్లలో 65 పరుగులు అవసరం.

ఈ సమయంలో వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. డక్‌వర్త్ లూయిస్ స్కోరు ప్రకారం ఢిల్లీ జట్టు వెనుక బడి ఉంది. అక్కడి నుంచే కేఎల్ రాహుల్ గేర్ మార్చి మ్యాచ్‌ను బెంగళూరుకు దూరం చేశాడు. 15వ ఓవ ర్‌లో జోష్ హేజిల్‌ వుడ్‌పై విరుచుకుపడి 22 పరు గులు రాబట్టి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత ప్రతి ఓవర్‌లో రాహుల్, స్టబ్స్ కలిసి బెంగళూరు బౌలర్లను బౌండరీ దాటించారు. 18వ ఓవర్‌లో రాహుల్ అద్భుతమైన సిక్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. రాహుల్ 53 బంతుల్లో 93 పరుగులతో అజేయంగా నిలవగా, స్టబ్స్ కూడా 38 పరుగులు చేశాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rahul's destruction on Bengaluru