జూలై 7, 2026

WhatsApp Image 2024 03 06 at 07.55.21

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మార్చి 06
తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ చేసింది.

నెహ్రూ కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని టీపీసీసీ కాంగ్రెస్‌ అధిష్టానా నికి సూచిస్తోంది. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీ పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వచ్చినప్పటికీ ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజ స్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు.

దీంతో ఈ ప్రతిపాదనకు తెరపడింది. సోనియా ప్రాతినిధ్యం వహించిన యూపీ రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో కనీసం రాహుల్ గాంధీ అయినా తెలంగాణ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ కోరుతోంది. కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న ఖమ్మం నుంచి రాహుల్‌ను బరిలోకి దించితే బాగుంటుందని సీఎం రేవంత్ కూడా యోచిస్తున్నారు…

You cannot copy content of this page