మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంచిర్యాల జోన్ పరిది శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆర్ బి వి ఆర్ ఆర్ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ అడిషనల్ డీజీ సందర్శించడం జరిగింది మొదటగా పోలీస్ స్టేషన్ చేరుకొన్న మేడమ్ ని జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్ ఎస్సై సంతోష్ లు మేడం కి మొక్కలు అందజేసి స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ఏఆర్ మహిళా సాయిధ దళ సిబ్బంది నుండి వందనం స్వీకరించి అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి రిసెప్షన్ సెంటర్ ను సందర్శించి రిసెప్షన్ డ్యూటీలు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందితో మాట్లాడి బాధితులు వచ్చినప్పుడు ఏ విధంగా వారిని రిసీవ్ చేసుకుంటున్నారు వారి సమస్యలు ఏ విధంగా తెలుసుకుంటున్నారు అని అడిగి తెలుసుకోవడం జరిగింది.
పోలీస్ స్టేషన్ లోని రూమ్స్, లాకప్, విమెన్, మెన్ బ్యారక్ పరిసరాలను, వాష్ రూమ్స్ పరిశీలించారు, టెక్నికల్ రూం, సిసి కెమెరాలను పని తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఎళ్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదు పై సత్వరం స్పందించి సేవలు అందించాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ పరిసరాల శుభ్రత, వాతావరణం, పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వసతుల పై సంతృప్తి వ్యక్తం చేశారు.
వెంట మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్., జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్, ఆర్ ఐ సంపత్ శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, లక్ష్మి ప్రసన్న, ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


