త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 5: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం.. బోగోలు మండలం: కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం సాయంత్రం జాతీయ స్థాయిలో టెక్నికల్ పేపర్ ప్రజెంటేషన్స్ టెక్నోపల్స్, 2కే26 , పేరుతో పోస్టర్ను రిలీజ్ చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో టెక్నికల్ పేపర్ ప్రజెంటేషన్, టెక్నికల్ పోస్టర్ ప్రజెంటేషన్, టెక్నికల్ ప్రాజెక్ట్ ఎక్స్ పో వంటి ఈవెంట్స్ ను డిపార్ట్మెంట్ వైజ్ నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ డిపార్ట్మెంట్ వైజ్ మరియు ఈవెంట్ వైజ్ ప్రజెంట్ చేసిన వారిలో బెస్ట్ త్రీ ని సెలెక్ట్ చేసి వారికి ఆకర్షవంతమైన బహుమతులను కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ ఈవెంట్స్ లో పాల్గొనడానికి ఫిబ్రవరి 22వ తేదీ లోపు అప్లై చేసుకోవాలని ఫిబ్రవరి 28వ తేదీ అప్లై చేసిన వారికి కన్ఫర్మేషన్ ఇస్తామని తెలిపారు. అలాగే ఈ ఈవెంట్ మార్చి 7వ తేదీన కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని, ఈ పోస్టర్ను జాతీయస్థాయిలో అన్ని ఇంజనీరింగ్ కళాశాలకు పంపించడం జరుగుతుందని కూడా తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో ఆర్వి రమణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వి.సునీల్ రెడ్డి, ఈవెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ వి.రవీంద్రారెడ్డి అన్ని విభాగాల హెచ్వోడీస్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


