ఖరీఫ్ పంట ప్రారంభం నాటికి సాగు నీటిని సక్రమంగా అందించేలా ఏర్పాట్లు
రాజమహేంద్రవరం: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రిలో గల వారి కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో రానున్న ఖరీఫ్ పంట సాగుకు పుష్కర కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు..
అలాగే పుష్కర కాలువ మరమ్మత్తులు మరియు నిర్వహణ నిమిత్తం నియోజకవర్గానికి మొత్తం 12 పనులు మంజూరు అయ్యాయని వాటిని త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు..ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈఈ రంగారావు , ఈఈ రాజేశ్వరరావు, డిఈఈ నాగేంద్ర ప్రసాద్, డిఈఈ పార్వతి , ఏఈ విజయ్ భరత్ , ఏఈ సాయి కృష్ణ, పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


