Yarlagadda Venkat Rao : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

TRINETHRAM NEWS

తేదీ : 02/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం గౌడ పేటలో ఎమ్మెల్యే, ప్రభుత్వ చిప్ యార్లగడ్డ వెంకట్రావు సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన , ఇంటింటికి వెళ్లి ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. అదేవిధంగా సంవత్సరం కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
అర్హులైనటువంటి లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూపాయలు పన్నెండు వేల కోట్లు ఖర్చు చేసి ఇరవై వేల లో మీటర్ల రోడ్లను బాగు చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నును రద్దుచేసి , ప్రజలకు ఊరట కలిగించిన సంగతి గుర్తు చేశారు. ఎనిమిది.యాభై లక్షల మంది రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసి రూపాయలు పదమూడు.ఐదు వేల కోట్లు చెల్లించామన్నారు. రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలో అమలు చేస్తామన్నారు. వచ్చేనెల ఆగస్టు పదిహేను వ తేది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ముందుగా పాత గన్నవరంలోని లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి. తులసి మోహన్, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ జస్టి. శ్రీధర్, బి . అలివేలు, మోదుగుముడి. వేణు, సత్యనారాయణ, యూనిట్ ఇంచార్జ్ పళ్ళ గాని. కోటి, ఆళ్ల .గోపాలకృష్ణ, మేడేపల్లి . రాము, బోడపాటి. రవి, కొమ్మరాజు. సుధీర్, దయ్యాల. రాజేశ్వరరావు, గొడ్డల్ల.చిన్న రామారావు, ఎ. గోపాలకృష్ణ, పడమటి. రంగారావు, పొదిలి. లలిత, మూల్పూరి. సాయి కళ్యాణి, పరుచూరి .నరేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Public welfare is the

You cannot copy content of this page

Scroll to Top