డిండి (గుండ్ల పల్లి)మార్చి 07… త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రణాళిక చర్యలో భాగంగా ,ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డిండి మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులముల బాలుర వసతిగృహములో ప్రతిజ్ఞ నిర్వహించారు.
నల్లగొండ జిల్లా ఉపసంచాలకులు షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉత్తర్వుల మేరకు మార్చి 6 నుండి 15 వరకు( 10) రోజులు ప్రణాళిక చర్యలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులముల బాలుర వసతి గృహములో హాస్టల్ బోర్డర్స్ చే ప్రతిజ్ఞ నిర్వహించారు.
జిల్లా అధికారి ఆదేశాల మేరకు పది రోజులపాటు నిర్దేశితమైన రోజు వారి కార్యక్రమాలు నిర్వహిస్తామని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్ నాగమణి, కలమ్మ, సునంద లతో పాటు హాస్టల్ బోర్డర్స్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


