ఆగస్ట్ 17, 2026

WhatsApp Image 2025 01 29 at 15.26.34

TRINETHRAM NEWS

మహిళ రక్షణ మా ప్రధాన లక్ష్యం.

మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలలు, బాలికల మరియు మహిళా వసతి గృహాల వద్ద సిసి టివి కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు తప్పనిసరి, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్.,

మంచిర్యాల త్రినేత్రం జ్యూస్ ప్రతినిధి, మంచిర్యాల జోన్ పోలీస్ ప్రధాన బాధ్యత మరియు లక్ష్యం అని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఐపిఎస్. పేర్కొన్నారు.

కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం యం.శ్రీనివాస్ ఐ.పి.యస్.ఆదేశాలను అనుసరించి మంచిర్యాల ఎగ్గడి భాస్కర్, ఐ.పి.యస్., డి.సి.పి., మంచిర్యాల మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ మహిళా కళాశాలల ప్రిన్సిపాళ్లు, బాలికల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ బాలికల, మహిళా వసతి గృహాల కు సంబంధించిన బాధ్యులను మరియు వార్డెన్ లను సమావేశపరచడం జరిగినది ఇట్టి సమావేశములో హాస్టల్ లలో తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యల గురించి, సి.సి.టి.వి., కెమెరా ల ప్రాముఖ్యత గురించి, సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు గురించి వివరంగా చర్చించి తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగినది.
మహిళా కళాశాలల ప్రిన్సిపాళ్లు, బాలికల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బాలికల మరియు మహిళల హాస్టల్ వార్డెన్ లకు డీసీపీ సూచనలు ఇస్తూ, హాస్టల్ యాజమాన్యం తమ హాస్టల్ లో తప్పనిసరిగా సి.సి.టి.వి.కెమెరాలు 30 రోజుల నిలివిడి సామర్థ్యం కలిగినవి, రిసెప్షన్, కారిడార్, నలువైపులా పరిసరాలు క్షుణ్ణంగా కనిపించే విధంగా బిగించు కోవాలని, హాస్టల్ పరిసరాలు వెలుతురు కలిగి ఉండాలని, హాస్టల్ లో పనిచేస్తున్న సిబ్బంది యొక్క పూర్తి సమాచారం కలిగి ఉండాలని తెలియపరచడం జరిగినది అదే విధంగా బాలికలయొక్క ప్రవర్తన, వారి కదలికలు గమనిస్తూ వారితో ప్రేమగా మనసువిప్పి మాట్లాడి వారి మానసిక ప్రవర్తనను గమనించి వారికి ఏవైనా ఇబ్బంధులు ఎదురైనచో తల్లి తండ్రి దృష్టికి తీసుకువెళ్లడం లేదా ఏదైనా ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే, హాస్టల్స్, వసతి గృహల ప్రాంతం లో ఎవరైనా అనుమానస్పదంగా కనిపించిన, ఇబ్బందులకీ గురిచేస్తున్నారనే సమాచారం ఉన్నా వెంటనే పోలీస్ వారి దృష్టి కి తెచ్చినచో తగు చర్యలు చేపట్టగలమని ఎల్లప్పుడూ పోలీస్ అందుబాటులో ఉంటుంది అని భరోసా ఇవ్వడం జరిగింది.

ఇట్టి సమావేశం లో డి. సి. పి. ఎగ్గడి భాస్కర్, ఐ.పి.యస్., డి.సి.పి., మంచిర్యాల తో పాటు ఆర్. ప్రకాష్, ఎ.సి.పి., మంచిర్యాల, యస్.ప్రమోద్ రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మంచిర్యాల, హైమ, షి టీం ఇంచార్జ్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page