Promises Trampled on : హామీలు తుంగలో తొక్కారు

TRINETHRAM NEWS

సిగ్గు లేకుండా ప్రగల్భాలు పలుకుతున్నారు….
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధ్వజం….
వెన్నుపోటు దినం విజయవంతం చేయాలి…
పసలపూడి లొ వైసిపి సమావేశం…

రాయవరం : త్రినేత్రం న్యూస్, ఎన్నికల ముందు అమలు కాని హామీలు గుప్పించిన కూటమి నాయకులు ఇపుడు వాటిని తుంగలో తొక్కారని మండపేట నియోజక వర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ద్వజమెత్తారు.పైగా సిగ్గు లేకుండా ప్రగల్భాలు పలుకుతున్నారనీ మండిపడ్డారు. రాయవరం మండలం పసలపూడి చింతా సుబ్బారాయుడు ఫంక్షన్ హాల్ లో సోమవారం వైసిపి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని మాట్లాడారు. ఎన్ డి ఏ కూటమి 2024 జనరల్ ఎన్నికలు లో మెజార్టీ సాధించిన ఈ నెల 4వ, తేదీని ప్రజా వెన్నుపోటు దినంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారని పేర్కొన్నారు.2024ఎన్నికలలోసూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన కూటమి నాయుకులు, అధికారం చేపట్టి ఒక ఏడాది పూర్తి అయినా ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు.అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల పై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.

వైసీపీ అధికారం కోల్పోయిన అనంతరం కేవలం జిల్లా పరిధిలోనే ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు చేపట్టామని తోట వివరించారు.ప్రస్తుతం తొలిసారిగా నియోజక వర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమం వెన్నుపోటు కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు,అభిమానులు తరలి రావాలని కోరారు. మండపేట పట్టణంలో గల వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని తోట పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు నల్లమిల్లి వెంకట రెడ్డి,మాజీ ఏ ఎమ్ సి చైర్మన్ సిరివరపు శ్రీనివాస్ రావు, వైసీపీ నాయకులు పోతంశెట్టి సత్యనారాయణ, చింతా సురేష్ రెడ్డి, పోతంశెట్టి సాయి రామ మోహన్ రెడ్డి, సర్పంచ్ కడలి పద్మావతి, మల్లిడి వీర రాఘవ రెడ్డి, కర్రి అయ్యప్ప రెడ్డి, అన్ని గ్రామాల నాయకుల ఎంపిటిసిలు , సర్పంచ్ లు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Promises trampled on

You cannot copy content of this page

Scroll to Top