CPI : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

TRINETHRAM NEWS

నూనె వెంకటేశ్వర్లు.
డిండి (గుండ్ల పల్లి) మే 26 త్రినేత్రం న్యూస్..కామే పల్లి CPI గ్రామ శాఖ సమావేశం తోటపల్లి నాగయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల కార్యవర్గ సభ్యులు నూనె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ,ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రజా సమస్యల ష్కారం అయ్యేంతవరకు ప్రజల వైపున నిలబడి పోరాటం నిర్వహించేది కమ్యూనిస్టు పార్టీ నే కమ్యూనిస్టులకు అధికారం ఉన్న ,లేకున్నా , ప్రజల పక్షాన సుదీర్ఘ పోరాటం చేస్తూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న, పార్టీ సిపిఐ అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని తేమశాతం , తరుగు ,లారీలకు వెయిటింగ్ చార్జీలని రైతుల దగ్గర ,ఐకెపి కొనుగోలు కేంద్రాల యజమాన్యం బస్తాకు రెండు,మూడు, కేజీలు తరుగు తిస్తున్నారు. ఆ నిబంధన లేకుండా రైతులకు న్యాయం చేయాలని, దళారీలకు ప్రోత్సహిస్తున్న ,కొనుగోలు కేంద్రాలను భవిష్యత్తులో మనుగడ లేకుండా చేయాలని, డిమాండ్ చేశారు.
అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తూ ,ఇండ్లు ఇవ్వాలని ,రాజీవ్ యువ వికాసం లోనుకు సివిల్ స్కోర్ ను ఎత్తివేసి ,అర్హులైన వారందరికీ రాజీవ్ యువ వికాసం లోన్లు మంజూరు చేయాలని, నిర్మాణ రంగం కార్మికులకు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కనీస వేతనం ఇవ్వాలని , కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, జూన్ 10వ తేదీన ఖానాపూర్ లో జరగబోయే CPI డిండి మండల 15 వ మహాసభను జయప్రదం చేయాలని ,ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ..
ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి తోటపల్లి నాగయ్య, సహాయ కార్యదర్శి గ్యార రామస్వామి,మాగాని లక్ష్మయ్య, పిట్టల సైదులు ,రాగం రాధ ,వెంకటయ్య ,విష్ణు , అలేందర్, తదిరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Promises made in the

You cannot copy content of this page

Scroll to Top