సిటీ టైగర్ పి.వి రమణకి కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేత.
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 26 : కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ కార్యాలయానికి భవనము ఏర్పాటుకు ఖాళీ స్థలం మరియు భవన నిర్మాణం కొరకు నిధులు కేటాయించేలా మీ సహాయ సహకారాలు కావాలని,కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య,కార్యవర్గ సభ్యులు సిటీ టైగర్ పి.వి రమణ వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిటీ టైగర్ పి.వి.రమణ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికి తీసి పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రజలతో మమేకమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అధికారికంగా ప్రెస్ క్లబ్ స్థలము,భవన నిర్మాణం ఏర్పాటు ఖచ్చితంగా జరగాలని,అలాగే నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్, జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు, వి.సుజాత, మీడియా కన్వీనర్ దుర్గాప్రసాద్,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. లక్ష్మి,ఈసీ మెంబర్ ప్రభాకర్ రెడ్డి,కర్ణ కుమార్, అనిల్ కిషోర్, బాబీ కాంత్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


