జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 16/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ. వెంకట్రావు ఆదేశాల మేరకు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న విద్యుత్ సమస్యకు అధికారులు ఐదు గంటల్లో పరిష్కారం చూపడం జరిగింది వివరాల్లోకి వెళ్తే బాపులపాడు మండలం, అంపాపురం గ్రామంలోని సగం ఇళ్లకు రోజుకి కేవలం తొమ్మిది గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవడం జరుగుతోంది. సరఫరా హెచ్చుతగ్గులు వస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నేపథ్యంలో ఉదయం పంచాయితీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మరియు గ్రామానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే కు స్థానికులు సమస్యని వివరించారు. ఎన్నో ఏళ్లుగా తాము పడుతున్న ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు ఆనుకూలంగా స్పందించిన ఆయన ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని విద్యుత్ శాఖ వీరవల్లి ఏఈ మురళి కృష్ణను ఆదేశించారు. ఆ మేరకు వెంటనే రంగంలోకి దిగిన విద్యుత్ సిబ్బంది కొత్త లైన్లు వేసి సాయంత్రానికి సమస్యను పరిష్కరించారు. ఎన్నో ఏళ్లగా పరిష్కారానికి నోసుకొని తమ సమస్యకు కేవలం ఐదు గంటల్లో పరిష్కరించిన ఎమ్మెల్యే వెంకట్రావుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.

Problem solved within hours

You cannot copy content of this page