Privatization of Medical Colleges : చంద్రబాబుకు పాలన చేతగాకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ

TRINETHRAM NEWS

అనపర్తి నియోజకవర్గం లో జోరుగా సంతకాల సేకరణ

మెడికల్ కళాశాలను కాపాడుకుందాం.

అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 16,
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కుతుకులూరు,
వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి, పిలుపు మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను, వ్యతిరేకిస్తూ ప్రజా మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణ చేపట్టడం, జరుగుతోందని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పేర్కొన్నారు.

అనపర్తి నియోజకవర్గం కుతుకులూరు గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించినట్టు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, గుర్తుచేశారు.
అందులో 7 కాలేజీలు జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో దాదాపు పూర్తి చెయ్యటం జరిగిందని,2023-24 లోనే 5 కాలేజీలలో క్లాసులు ప్రారంభం అయ్యాయని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కు పేదల ఆరోగ్యం పట్ల, పేదల ఉన్నత చదువుల పట్ల చిన్నచూపు కానవస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ వైయస్‌ఆర్‌సీపీ కోటి సంతకాల ఉద్యమం చేపట్టిందని వివరించారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గవర్నర్,కి ప్రజాభిప్రాయం తెలియజేస్తామని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్బెళ్ళ కృష్ణారెడ్డి(అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్,తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి), సత్తి రామకృష్ణారెడ్డి(రాంబాబు)(అనపర్తి మండల వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్), వీర వెంకట రెడ్డి(గ్రామ కన్వీనర్), సబ్బెళ్ళ నాగిరెడ్డి (గ్రామ ఉపసర్పంచ్), పడాల దుర్గా రెడ్డి (ఆర్.కే),
(నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు), గణపతి మండల మహిళా విభాగం అధ్యక్షులు తేతలి రుక్మిణి, మండ సుజాత, పులగం వీర్రెడ్డి, సత్తి రాజశేఖర్ రెడ్డి, సత్తి సుబ్బారెడ్డి, గొలుగూరి సురేంద్రరెడ్డి, సత్తి రమేష్ రెడ్డి తదితరులు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Privatization of medical colleges

You cannot copy content of this page

Scroll to Top