Trinethram News : Jun 29, 2025, తెలంగాణ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ సమీపంలో అదుపు తప్పి ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 అంబులెన్సుల్లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


