
- జూకా సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు
- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
- తీదేడు గ్రామ సర్పంచ్
Printer Donated : చింత పల్లి జులై 22, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామ పంచాయతీ కార్యాలయానికి జూకా సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రింటర్‌ను బహూకరించారు.తీదేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు హెచ్ ఆర్ నరేష్ ప్రింటర్‌ను గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ…గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు అందించే వివిధ సేవలు,ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పత్రాల ముద్రణకు ప్రింటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.గ్రామ అభివృద్ధికి సహకరిస్తూ అవసరమైన పరికరాలను అందజేస్తున్న జూకా సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యానికి శాలువాలతో సన్మానించి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమావత్ హానుమా నాయక్,మాజీ ఉప సర్పంచ్ లు ఉలుపాల శేఖర్ రెడ్డి,ధరణిపతి రమణారావు,సోనగంటి గోవర్ధనాచారి, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్,వార్డు సభ్యులు మాదగోని కృష్ణ గౌడ్,దాసరి కళమ్మ ముత్తయ్య,రెడ్డి పద్మ పరమేష్,శివర్ల పర్వతాలు యాదవ్,గ్రామస్తులు మర్రు రామారావు,సిమర్ల శ్రీను యాదవ్,జూకా సోలార్ పవర్ ప్లాంట్ ప్రతినిధులు అకోంటెట్ తారక్,అడ్మిన్ హానిత్,వేణు,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe