ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Ramavath Ravindra Kumar

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

Ramavath Ravindra Kumar : దేవరకొండ డివిజన్ జులై 22, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం కాచారం గ్రామానికి చెందిన ముదిగొండ సామెల్ మృతి ఎంతో బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం కాచారం గ్రామంలో నిర్వహించిన ముదిగొండ సామెల్ దశదిన కర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామెల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ముదిగొండ సామెల్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించిన రవీంద్ర కుమార్, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ్డు గోపాల్ గౌడ్, ముదిగొండ సంజీవ, బొడ్డుపల్లి కృష్ణ, ముదిగొండ హరిదాస్, బొడ్డు మల్లేష్, ముదిగొండ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page