నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
Droupadi Murmu: ఐదు రోజుల పర్యటనలో భాగంగా నేడు రాష్ట్రపతి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటించనున్నారు. అక్కడి జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత, స్పిన్నింగ్ యూనిట్‌ను సందర్శించనున్నారు..
దీనితోపాటు.. అక్కడే ఏర్పాటుచేసిన థీమ్ పెవిలియన్ పార్కను సందర్శించనున్నారు..
రాష్ట్రపతితో కలిసి కేవలం ఆరుగురికి మాత్రమే సభావేదికపై ఆహ్వానం ఉంటుంది. గవర్నర్ తమిళి సై,రాష్ట్ర మంత్రులు సీతక్క ,తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరు అధికారులకు అవకాశం ఉండనుంది..
భూదానోద్యమ కారులైన ఆచార్య వినోభాబావే, భూదాత వెదిరే రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేయనున్నారు. చేనేత కార్మికులతో రాష్ట్రపతి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకోనున్నారు. చేనేత మాస్టర్ వీవర్ శివకుమార్‌తోను ప్రత్యేక సమావేశం కానున్నారు. తర్వాత మగ్గాలు పరిశీలించి 350 ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మొత్తంగా సుమారు 45 నిమిషాలపాటు పోచంపల్లిలో పర్యటించనున్నారు..