MLA Gorantla : మహిళ సంరక్షణ ధ్యేయంగా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది

TRINETHRAM NEWS

మహిళలకు స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల

కడియం : త్రినేత్రం న్యూస్ : మహిళ సంరక్షణ ధ్యేయంగా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అనేక సంక్షేమ కార్యక్రమాలలో మహిళలకు పెద్దపీట వేస్తుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు కడియం మండల పరిషత్ కార్యాలయం నందు ఎం.పీ.పీ వెలుగుబంటి సత్యప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన కుట్టు మిషన్ (టైలరింగ్) కేంద్రాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ మహిళలందరికీ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి, వారి ఉపాధి మెరుగుపరచడంలో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. కడియం మండలంలో 249 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వీరందరికీ 90 రోజులపాటు శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం కుట్టు మిషన్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు.

ఒకప్పుడు మహిళ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వారికి స్వయం ఉపాధి కల్పించాలి అని లక్ష్యంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని, ఆ తరువాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు డ్వాక్రా గ్రూపులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించి మహిళలు స్వయం ఉపాధితో జీవించే విధంగా ఎన్నో కార్యచరణలు చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా మహిళ సంఘాల వారికి ఎంతో చేయూతనిస్తుందని, 10 లక్షల వరకు బ్యాంకు రుణాలు అందించి వారి అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుందని, మహిళలు సొంతంగా ఉపాధి పొందడంతో పాటు మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు.

ఈ కేంద్రం నందు ట్రైనింగ్ తీసుకుంటున్న వారందరూ వృత్తి నైపుణ్యాన్ని బాగా పెంపోందిచుకోవాలని, సొంతంగా ఉపాధి పొందే విధంగా శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి మాట్లాడుతూ ఇంటికి పరిమితమైన మహిళలను ఈరోజు సమాజంలో స్వయం ఉపాధి సంపాదించుకునే విధంగా మనకి అవకాశాన్ని కల్పించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని, ఆనాటి దీపం పథకం మొదలు ఈనాటి వరకు మహిళా పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, వైస్ ఎంపీపీ పంతం గణపతి, మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, బోడపాటి గోపి, ముద్రగడ జమ్మి, ప్రత్తిపాటి రామారావు చౌదరి, చెల్లుబోయిన శ్రీనివాస్, పాఠంశెట్టి రాంజీ, చెక్కపల్లి మురళీకృష్ణ, ఏపీఎం నాగలక్ష్మి, బొరుసు సుబ్రహ్మణ్యం, కలిదిండి గోవిందు, ఆదిమూలం సాయిబాబా, వాసంశెట్టి నాగబాబు, సురపురెడ్డి జానకిరామయ్య, జల్ది కృపారావు, గుత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The coalition government aims

You cannot copy content of this page

Scroll to Top