కంటే కూతుర్నే కనాలి!!

TRINETHRAM NEWS

కంటే కూతుర్నే కనాలి!!

మణుగూరు:డిసెంబర్‌ 19:
అనారోగ్యంతో మరణించిన తండ్రికి కూతుళ్లు తలకొరివి పెట్టారు. ఆ నలుగురు గా మారిన కుమార్తెలు అంతిమ సంస్కారంలో అన్ని తామై కర్మకాండలు నిర్వ హించారు.

మణుగూరు మండలం రాజుపేటలో సోమవారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటు చేసు కుంది.’కంటే కూతుర్నే కనాలిరా.. మనసుంటే మగాడిగా పెంచాలిరా..’ అనే పాటకు నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యాలు.

అల్లారుముద్దుగా పెంచిన తండ్రి ఆకాల మరణం మనసును మెలిపెడుతున్న మొక్కవోని ధైర్యంతో అంతి మ సంస్కారంలో అన్ని తామై ఆ నలుగురుగా మారారు.

మణుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్ లో నరసింహారావు,గోపమ్మ దంపతులు నివాస ముండ గా, నరసింహరావు సింగ రేణి విశ్రాంత ఉద్యోగి, వీరికి ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు,తనకు ఉన్నం తలో ఆరు గురు పిల్లలని ఉన్నత చదువులు చదివించాడు

నరసింహరావు,కొడుకు రెండు సంవత్సరాల క్రితం ఈతకు వెళ్లి గోదావరిలో పడి చనిపోయాడు. అప్పటి నుండి ఆ ఇంటికి అన్ని తామే అయి ఆ కుతుర్లే అమ్మానాన్నలను చూసు కుంటున్నారు.

నరసింహారావు నిన్న తెల్ల వారు జామున గుండె నొప్పి తో బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు హాస్పట ల్‌కి తరలించారు.

చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమం లోనే నరసింహరావు మృతి చెందాడు. ఇంట్లో మగ వాళ్ళు ఎవరు లేకపోయే సరికి అన్ని తామై తమ తండ్రీ చివరి కార్యక్రమాలు నిర్వహించారు

అయిదుగురు కూతుళ్లు. తండ్రి చివరి అంకంలో పెద్ద కూతురు తలకొరివి పెట్టగా మిగిలిన నలుగురు కూతుళ్లు పాడే మోస్తూ కన్నీరు మున్నీరుగా విలపించారు…

You cannot copy content of this page

Scroll to Top