TRINETHRAM NEWS

Praveen Prakash VRS application approved Govt

Trinethram News : అమరావతి:

ప్రవీణ్ ప్రకాష్ వి.ఆర్.ఎస్ దరఖాస్తు ఆమోదించిన ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ లో ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ వాలెంటరీ రిటైర్మెంట్ దరఖాస్తును ఎపి ప్రభుత్వం ఆమోదించింది.

జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధమైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ఏడేళ్ల సర్వీసు ఉండగానే వీఆర్‌ఎస్‌కు సిద్ధమయ్యారు.

కొన్ని వివాదాలు ఆయనను చుట్టు ముట్టడంతో ప్రవీణ్ ప్రకాష్ గత నెల 26న ప్రభుత్వానికి వి.ఆర్.ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు.

కాని ప్రభుత్వం మొదట్లో ఆయన ధరఖాస్తును పరిగణలొకి తీసుకోకపోవడం తో ఆయనకు విఆర్ఎస్ దొరకదని సచివాలయం వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది.

అయితే ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ వి ఆర్ ఎస్ దరఖాస్తును ఆమోదిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్‌ ప్రసాద్ ప్రసాద్ జీవో ఆర్.టి.నం.1207 విడుదల చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Praveen Prakash VRS application approved Govt