Collector Koya : ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని

TRINETHRAM NEWS

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన స్వరూప భారీ వర్షాలకు తన ఇండ్లు కూలిపోయిందని, తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు
పెద్దపల్లి మండలం రాఘవ పూర్ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త బొబ్బిలి సత్యనారాయణ పెద్ద బొంకూరు గ్రామంలో సర్వే నెంబర్ 534 లో 6 ఎకరాల భూమి ఎల్.ఆర్.ఎస్ అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా ఓపెన్ ప్లాట్లు అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన గోనెల రవి, ఎన్.లక్ష్మీ, ఓదెలు , రాజమల్లు గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి 59వ సర్వే నెంబర్ లో భూమి గత 40 సంవత్సరాలుగా పూర్వీకుల నుండి సాగు చేసుకుంటున్నారని, ఆ భూమి ప్రస్తుతం తన కబ్జాలో ఉందని, తనకు ఎటువంటి పట్టా లేదని మోకా పై సర్వే చేయించి పట్టాలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Prajavani applications should be given top priority

You cannot copy content of this page

Scroll to Top