TRINETHRAM NEWS

Posters of Ganesh idols unveiled by District Collector

త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినీది

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
వినాయక చవితి పండుగ ను పురస్కరించుకొని ఈ సంవత్సరం, పర్యావరణం పై అవగహన కల్పించేందుకు. మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్, గౌతమ్ పొట్రు, ఐఏఎస్ పోస్టర్లను ఆవిష్కరించారు.
పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఎర్పాటు చేసుకోని పర్యావరణాని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలొ భాగాంగ 8 అంగుళాల మట్టి గణపతి లను అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు టీజీపీసీబీ నిర్వహంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

అవగాహన కార్యక్రమాలలొ బాగంగా రాష్ట్ర వ్యాప్తం గా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన ఆటోట్రాలీ ల ద్వారా పర్యావరణ సందేశంలతో ప్రదర్శన, ప్రింట్ మరియు ఎలక్ట్రనిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు టీజీపీసీబీ సిద్దమౌతుంది. మట్టి గణపతి ద్యారా పర్యావరణ పరిరక్షణ పై పాఠశాలలో, కళాశాలల్లో క్వీజ్ కార్యక్రమాలు నిర్వహించడం, చేతి వృత్తిల వారికి మట్టి విగ్రహలు తయారిపై శిక్షణ, ఆటోల వెనుక, పోస్టర్ల ప్రదర్శన, బస్టాప్ లలో హోర్డింగ్ లు మట్టి గణేష్ ల ద్యారా పర్యావరణ పరిరక్షణ పై కళాజాత కూడ నిర్వహించడం జరుగుతోంది.
చెరువుల్లో మట్టి మేటలని తొలిగించటానికి చెరువులో స్వచ్ఛత కాపాడటానికి వినాయక చవితి సందర్బంగా ప్రజలు భక్తులు నడుము బిగించాలాని మట్టి తో వినాయక విగ్రహాలు తాయారు చేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసారు.
ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ.
ప్రాంతీయ కార్యాలయం, మేడ్చల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బి.రాజేందర్ సూచనల మేరకు వారి ఆఫీసు సిబ్బంది జి. లింగయ్య ఐ ఈ ఎస్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Posters of Ganesh idols unveiled by District Collector